దర్శిలో జగనన్న సురక్ష తోఅర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు -దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ – లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం చరిత్ర సృష్టించిందని మీతో పంచుకోవడానికి గర్వపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి లో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ … అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమైన ధ్రువపత్రాలు అందించి , సంక్షేమ పథకాలను మరింత చెరువ చేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని అన్నారు .ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రికార్డు సమయంలో అత్యధిక సేవలు అందించే ఇలాంటి కార్యక్రమాల అమలుకు ప్రయత్నించలేదని చెప్పారు.జులై 1 నుంచి 31 వ తేది వరకు 30 రోజులు పాటు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని అన్నారు.
అర్హులెవ్వరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందకుండా మిగిలిపోరాదన్న లక్ష్యంతో ప్రజలకు అవసరమైన సేవలు అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్, జూన్ 23, 2023 న ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన అమలుకు ఆదేశించారని అన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమం మొత్తం రెండు భాగాలుగా నిలిచిందని చెప్పారు.
ఈ కార్యక్రమం అమలు కోసం ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లకు సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. అనంతరం ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో మండల స్థాయి అధికారులు శిబిరాలు నిర్వహించి అక్కడికక్కడే పౌరులకు అవసరమైన సర్టిఫికెట్లను ఉచితంగా అందించారని అన్నారు.
ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు మినహా ఇతర అంశాలకు చెందిన అభ్యర్థనలను అధికారులు ప్రత్యేకంగా నమోదు చేసుకున్నారని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యల పై రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో అత్యధిక సేవలు అందించిన జగనన్న సురక్ష కార్యక్రమ గణాంకాలను వివరించారు.
జూలై 1 నుంచి జూలై 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో జగనన్న సురక్ష శిబిరాలు నిర్వహించారని,
జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల (1,46,27,905) కుటుంబాలను వాలంటీర్లు సర్వే చేసి ప్రజలకు ఏ విధమైన సేవలను నమోదు చేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.
జగనన్న సురక్ష శిబిరాల్లో 93.5 లక్షలకు పైగా (93,57,707) అభ్యర్ధనలు పరిష్కరించబడ్డాయి/సర్టిఫికెట్లు జారీ చేయబడ్డాయి, మొత్తం అభ్యర్ధనల్లో ప్రభుత్వం 97 శాతం పరిష్కరించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జూలై 18 న ఒక్క రోజే 7.54 లక్షల సర్టిఫికెట్లను అందించి రికార్డు సృష్టించిందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి నియోజకవర్గంలో 79 క్యాంపులు నిర్వహించి 35,830 సర్టిఫికెట్లు మంజూరు చేశామన్నారు. నియోజకవ ర్గంలో కూడా 97 శాతం సమస్యలు పరిష్కారం చేసి నట్లు తెలిపారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ పొందిన 5 సేవలలో

  1. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కొత్తవి): 45.33 లక్షలు
  2. ఆదాయ ధృవీకరణ పత్రాలు: 41.50 లక్షలు
  3. ఆధార్-మొబైల్ అప్డేషన్: 2.72 లక్షలు
  4. రెవెన్యూ హక్కుల రికార్డు (ROR-1B)/ ల్యాండ్ టైటిల్: 2.70 లక్షలు 5. అడంగల్ సర్టిఫికెట్లు: 1.40 లక్షలు ఉన్నాయని వివరించారు.
    కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన 1.69 లక్షల మంది వాలంటీర్లు, 1200 మండల అధికారులు మరియు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింత ప్రభావవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సిబ్బందికి అవగాహన కల్పించి మొత్తం పర్యవేక్షణలో సహకరించిన కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, స్థానిక అధికారులు ,గృహ సారథులు మరియు ప్రజా ప్రతినిధులకు జగనన్న సురక్ష విజయంలో ప్రత్యేక ప్రస్తావన ఉందని అన్నారు.
    ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. అర్హులైన ప్రతి పౌరుడికి 100 శాతం పథకాలను అందజేయాలన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిబద్ధతకు జగనన్న సురక్ష కార్యక్రమం నిదర్శనమని అన్నారు. జగనన్న చెప్పడంటే – చేస్తాడంతే అని నమ్మే మా ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్ కి జగనన్న సురక్ష విజయవంతంతో మరో ఘనత చేరినట్లైందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
  5. లోకేష్ వ్యాఖ్యపై వైఎస్ఆర్సిపి నాయకులు ఆగ్రహం*దర్శి నియోజకవర్గంలో 256 ఎకరాల ప్రభుత్వ భూముల్లో జగనన్న లేఔట్లు వేశామని, ఎక్కడా సెంటు భూమి కూడా కొనుగోలు చేయకపోయినా లోకేష్ రూ.3 కోట్లు దోచుకున్నారనడం సిగ్గుచేటన్నారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్ ), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి మాట్లాడుతూ నెలకు జీతాల రూపంలో రూ.కోట్లు చెల్లించే ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ స్థాయిని మరిచి లోకేష్ మాట్లాడటం లోకేష్ హుందాతనాన్ని దిగజారుస్తుందన్నారు. అసత్యాలు ప్రచారం చేసేందుకే పాదయాత్ర పెట్టారా అని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్ కూడా గెల వలేని నువ్వా విమర్శించేంది అంటూ లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, రాష్ట్ర గ్రేనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, అంబటి వెంకటేశ్వర్ రెడ్డి, బెల్లం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *