తాగునీటి అవసరాలకు విడుదలచేసిన సాగరు నీరు నిలిచిపోవటంతో దర్శిలో చెరువును నింపటానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. డి ఈ అక్బర్ బాషా , సిబ్బంది దర్శిలో సాగరు ప్రధాన కాలువ పరిధిలో ఒంగోలు బ్రాంచి కాలువ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి బుధవారం లాకులు మూయించారు. తద్వారా నీరు కిందకు పోకుండా మరో రెండు రోజుల పాటు ఎన్ఏపీ చెరువులో నీరు నింపటానికి ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

