సీఎం వైఎస్ జగన్ సహకారంతో దర్శిలో అభివృద్ధి కార్యక్రమంలో ముందంజ -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్- డాక్టర్ వైఎస్సార్ అగ్రిల్యాబ్ ప్రారంభం – 50 పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం

గత ప్రభుత్వాల్లో దర్శి నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలోనే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం జరిగందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నగర పంచాయతీ పరిధి శివరాజనగర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రూ.58.69 లక్షలతో డాక్టర్ వైఎస్సార్ అగ్రి ల్యాబ్ రూ.2.10 కోట్లతో పట్టణంలోని 50 పడకల ఆస్పత్రి నూతన భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అగ్రి ల్యాబ్లో ప్రత్యేక పూజలు చేశారు. వైద్యశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభో త్సవాలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ …ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు
ల్యాబ్ లు రాగా అందులో ఒకటి దర్శిలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన ల్యాబ్ ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యత తెలుసుకునేందుకు అగ్రి టెస్టింగ్ దోహద పడుతుందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంట ఇన్సూరెన్స్ తో కలిగే ప్రయోజనాలు, ఖరీఫ్ సీజన్లో వచ్చిన ఇన్సూరెన్స్ల గురించి తెలి పారు.
అనంతరం 50 పడకల ఆస్పత్రిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లో ఈ వైద్యశాలలో ముగ్గురే వైద్యులు ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం 11 మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత లేకుండా అందరికీ వైద్యం అందేలా 50 పడకలతో ఆస్పత్రిని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. 2019లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కోరిన వెంటనే ఆస్ప త్రిలో 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధికి సహకరించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర మద్దిశెట్టి శ్రీధర్,, డీసీహెచ్ఎస్ ఎస్ఎన్ మూర్తి, ఏడీఈ బాలాజీనాయక్, సూపరింటెండెంట్ ఆంజనేయులు, ఏఓలు బాలకృష్ణ నాయక్, లక్ష్మీనా రాయణ, మధుబాబు, ప్రసాద్, ఫరూక్, వెంకటరావు, కోటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమి రెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, మేడం మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *