దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ జన్మదిన వేడుకలను అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి గడియార స్తంభం సెంటర్లో నాయకులు సహకారంతో మండల జెసిఎస్ కన్వీనర్, తూర్పు వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ బత్తినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాటకచ్చేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కేక్ కట్ చేసి మాట్లాడారు. అనంతరం నాయకులు, అభిమానులు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ను శాలువాలతో, గజమాలలతో సత్కరించారు. చందలూరులోని శ్రీలక్ష్మినరసింహస్వామి గుడిలో, చలివేంద్రం వద్ద శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో ఎమ్మెల్యే ప్రత్యేకపూజలు నిర్వహించారు. కాశినాయన ఆశ్రయంలో ఎలక్ట్రికల్ వంట తయారీ మిషన్ను ఎమ్మెల్యే డాక్టరు మద్దిశెట్టి వేణుగోపాల్ అందించారు. మోడల్ స్కూల్ విద్యార్థులకు కిట్లు పంపిణి చేశారు. కాశీనాయన, షిర్డిసాయిబాబా, వెంకటరమణ వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అన్నదానం చేశారు. దుప్పట్లు పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలరు నారాయణమ్మ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వైసిపి అభిమానులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైసిపి దర్శి తాళ్లూరు మండలం ఇన్చార్జిలు మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి రవీంద్ర, వైసిపి
మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్రకార్పొరేషన్ డైరెక్టర్లు కుమ్మిత అంజిరెడ్డి, ఎంపిపిలు గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య, తాటికొండ శ్రీనివాసరావు, సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, బెల్లం చంద్రశేఖర్, జి. ఉషారాణి మురళీ, జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, జెసిఎస్ మండల ఇన్ఛార్జులు బత్తినేని వెంకటేశ్వర్లు, మేడికొండ జయంతి, శ్రీనివాసరెడ్డి, పోలయ్య, నాయకులు మిల్లర్ బుజ్జి, గంగిరెడ్డిపాలెం ఎలమందరెడ్డి వివిధ శాఖల అధికారులు, అభిమానులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





























