నాభూమి- నాదేశం విజయవంతం చెయ్యటానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎపీడీ పద్మశ్రీ అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎం.ఎన్. ఆర్.ఈజీ.ఎస్ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపంచాయతీ పరిధిలో పాఠశాలలు, సచివాలయాలు. ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు విరివిగా నాటే విధంగా తగ్గిన ప్రణాళిక తయారు చెయ్యాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల సందేశాల ను చేరవేస్తూ ఈనెల 9 నుండి 15వరకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనికోరారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపిఓ మురళి తెలిపారు. ఈసీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

