తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని, ప్రకృతి ప్రసాదించిన వరమని రాజంపల్లి సర్పంచి అన్నపూర్ణ అన్నారు. రాజంపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలవారోత్సవాలు నిర్వహించారు. గర్భిణిలకు, బాలింతలకు జగనన్న సంపూర్ణ పోషణ కిట్ లను అందించారు. పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడి టీచర్ నరసమ్మ, ఆయా చిన అంకమ్మ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
