పేరటి కోళ్ల పెంపకంతో ఆర్థిక అభివృద్ధి చెందవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో గిరిజన ఉప ప్రణాళికలో బాగంగా పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ….పెరటి కోళ్ల పెంపకంతో గిరిజన రైతులలో నిరుద్యోగ యువతీ యువకులకు చక్కగా ఉపయోగ పడతాయని చెప్పాడు. వికే పశువిభాగవు శాస్త్రవేత్త డాక్టర్ లీలా క్రిష్ణ మాట్లాడుతూ… పెరటి కోళ్ల పెంపకం వలన కలిగే ఉపయోగాలు, కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలను గురించి వివరించారు. గిరిజన రైతులకు శిక్షణ అనంతరం ఆసిల్ జాతికి చెందిన కోడి పిల్లల పంపిణీ చేసారు. కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఉష, డాక్టర్ శివ, డాక్టర్ టీవీ రెడ్డి, టి మానస, ఎం. జాహ్నవిలు పాల్గొన్నారు.

