గడపగడపలో ప్రజల అవసరాలు తీర్చడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ధ్యేయంగా పని చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణం లోని 18వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం జరిగింది. పలువురి సమస్య లను ఆయన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పని చేస్తున్నారని చెప్పారు. పాఠశాలల్లో నాడు- నేడు ద్వారా విద్యార్థులకు అన్నీ వసతులు కల్పించారని, ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చది వేందుకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మఒడి ఇస్తు న్నారన్నారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రతి ఇంటిని సందర్శించి వారి అవసరాలను తెలుసుకుని ఉచిత సేవలందించడం దేశంలోనే ఒక వినూత్న విజయమని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్ర బాబు హామీలన్నీ మాఫీ చేసి మేనిఫెస్టోని ఆన్లైన్లో కూడా లేకుండా చేసి ప్రజల ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. ఇక ఎన్ని ఎన్నికలు వచ్చిన ఎప్పటికీ ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వార్డు నాయకులు కట్టెకోట హరీష్, పట్టణ సచివాలయ కన్వీనర్ ఎదురుకోటి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు వి.సి రెడ్డి మోహన్ రెడ్డి, బాబురావు, మోహన్ బాబు, నారాయణరెడ్డి నగరపంచాయతీ కమిషనర్ మహేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దేవప్రసాద్, నాయకులు ఆమెన్ భాష (మిల్లర్ బుజ్జి), రవి, జగన్, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.






