టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి రేసులో మొదట్నుంచి ముగ్గురు పేర్లు గట్టిగా వినిపించినప్పటికి చివరకు కీలక పదవి భూమన కరుణాకర్‌రెడ్డిని వరించింది. భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ సీఎం ఉండగా రెండో సారి టీటీడీ ఛైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. చివరకు భూమనకు పదవి వరించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *