విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని జిల్లా వైద్యాధికారి ఎస్ రాజ్యలక్ష్మి అన్నారు. తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ … విద్యార్థులు ప్రతి ఆరునెలలకు ఒక సారి ఆల్ బెండాజోల్ మాత్రలు వేసుకోవటం వలన ఆనారోగ్య సమస్యలు దరి చేరవని చెప్పారు. 19 సంవత్సరం లోపు పిల్లలు అందరితో డీ వార్మింగ్ మాత్రలు వేయించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై, ఆరోగ్య సిబ్బందిపై ఉందని అన్నారు. మాత్రలు నమిలి మంచి నీటితో వేసుకోవాలని చెప్పారు. పిల్లలతో నులి పురుగుల నివారణకు చక్కగా ఉపయోగపడి చిన్నారుల శారీరక ఉన్నతికి చక్కగా ఉపయోగపడతాయని వివరించారు. వైద్యశాలలో అందుతున్న సేవల గురించి, ప్రత్యేకించి ప్రతి నెల 9న జరుగు గర్భిణీ స్త్రీల పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం, వైద్యురాలు మౌనిక, ప్రధానోపాద్యాయుడు నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

