అమృత్ భారత్ లో బాగంగా రైల్వే స్టేషన్లను బిజెపి ప్రభుత్వం ఆధునీకరిస్తుంది ప్రధాన మోడీ జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో వేగవంతంగా జరుగుతు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర రెడ్డి అన్నారు. దర్శిలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ …దేశంలో 56 రైల్వే స్టేషన్లను, ఆంధ్ర రాష్ట్రంలో 72
స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, శింగరాయ
కొండ, దొనకొండ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
*ధర్నా కార్యమ్రాన్ని విజయవంతం చెయ్యాలి*
ఈనెల 10న బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంచెయ్యాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి కోరారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు. నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, దర్శి నియోజక వర్గ అసెంబ్లీ కన్వినర్ మాడపాకులు శ్రీనివాసులు, కిసాన్ మోర్చ అద్యక్షుడు శ్రీనివాసులు,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఆంజనేయులు, లీగల్ సెల్ కో కన్వీనర్ బసవేశ్వర రావుతదితరులు పాల్గొన్నారు.


