సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఊరట పై కాంగ్రెస్ నేతల హర్షం

సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై మోడీ అనే ఇంటి పేరు పరువునష్టం దావా లో రాహుల్ గాంధీ కి పడిన శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దరిశి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పుట్లూరి కొండారెడ్డి, సాయిక్రిష్ణ, కర్ణ పుల్లారెడ్డి తదితరులు సత్యం మాత్రమే గెలుస్తుంది రాహుల్ గాంధీ కి ఊరట కలిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూన్నాం అని, న్యాయం జరిగినదని ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. రాజ్యాంగానికి సమున్నత గౌరవం దక్కిందని రాహుల్ గాంధీని వెంటాడి వేటాడుతూ.. బిజెపి సాగించిన కుట్రబయటపడిందని.. విమర్శించారు .విపక్షాలను లక్ష్యంగా చేసుకొని బురదజల్లే కార్యక్రమం నిలుపుదల చేయడానికి వారికి బిజెపి సమయం వచ్చింది ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించటానికి.. దేశానికి పాలించడానికి ఇదే సరైన సమయం అని, ఈ పని చేయడం లో గత 20సంవత్సరాల్లో దారుణంగా విఫలమయ్యారని అని కొండా రెడ్డి విమర్శించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *