కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నలిగిపోతున్న కార్మిక వర్గం మోదీని గద్దె దించాలి-దేశాన్ని రక్షించాలి అనే నినాదంతో విజయవాడ నగరంలో ఆగస్టు 9న శ్రామిక జన గర్జన నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ ప్రకాశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటం శెట్టి హనుమంతరావు తెలిపారు. స్థానిక గుజ్జుల సరళ దేవి భవన్ సిపిఐ కార్యాలయంలో శనివారం ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలతో ఏఐటీయూసీ దర్శి నియోజకవర్గ ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన హనుమంతరావు మాట్లాడుతూ... కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా ఆగస్టు 9న విజయవాడ మహానగరంలో కార్మికులతో శ్రామిక జన గర్జన (మహాపడావ్) కు పిలుపునిచ్చాయని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 6, 7 తేదీలలో అన్ని పారిశ్రామిక కార్మిక ప్రాంతాలలో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వివరిస్తూ క్విట్ మోడీ సేవ్ ఇండియా నినాదాలతో సైకిల్ మోటార్ బైక్ ర్యాలీల ద్వారా ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హనుమంతరావు వివరించారు కార్మికులకు రక్షణగా ఉన్న 42 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సులు ప్రవేశపెట్టడం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటు కార్పోరేట్ వ్యక్తులకు దారా దత్తం చేయడం విశాఖ స్టీలు గంగవరం పోర్టు లాంటి వాటిని ప్రైవేటీకరించడానికి కార్మికులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని ఇటువంటి దేశద్రోహుల నుండి కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జూపల్లి కోటేశ్వరరావు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు చిన్న ఆంజనేయులు, జి కాశిరెడ్డి, జక్కా బుచ్చయ్య, మెట్నాల శ్రీను, వెంకటరావు, గుర్రపు సాల బాలరాజు, శ్రీను వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.