ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించి రాష్ట్రాన్ని సంక్షేమాంధ్ర ప్రదేశ్ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని 15వ వార్డులో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ప్రజలకు మేలు జరిగితేనే ఓట్లు వేయండి.. అని అడిగే దమ్మున్న ఏకైక ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ పార్టీ నాయకులే అడ్డగోలుగా దోచుకుతిన్నారన్నారు. దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ ఫలాలు అందిస్తున్న వలంటీర్లను విమర్శించడం సహించరానిదన్నారు. మండల పార్టీ కన్వీనర్ వెన్నపూస వెంక టరెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, పట్టణ జేసీఎస్ కన్వినర్ ఎదురుకోటిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, యర్రయ్య, ఖాశీం బ్రదర్స్, అంకబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.





