అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దొనకొండ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, మౌలిక వసతుల ఏర్పాటుకు ఎంపిక కావటం దొనకొండకు గొప్పవరమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రధాని మోదీ నిర్వహించే ఆన్ లైన్ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తో కలిసి మంత్రి సురేష్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… గతంలో దొనకొండలో లోకో షెడ్ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందని నేడు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీఎం జగ న్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి మోదీ సహకారం దొనకొండను అమృత్ భారత్ పథకం కిందఅభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారన్నారు. దొనకొండ రైల్వేస్టేషన్ను అన్ని హంగులతో అభి వృద్ధి చేకూర్చేందుకు రూ.18.3 కోట్లు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. దొనకొండను అమృత భారత్ పథ కంలో చేర్చటం చాలా సంతోషకరమన్నారు. అనంతరం వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహు మతులు అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైల్వే ఏడీ ఆర్ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.
*సమస్యలతో కూడిన అర్జీలు అందజేత:*
దొనకొండ ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖ ఉన్నతాధికారులకు, మంత్రి సురేష్, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు సమస్యలతో కూడిన అర్జీలు అందజేశారు. ఎక్స్ ప్రెస్ రైళ్లను రాత్రి వేళల్లో నిలుపుదల చేయాలని, రైళ్లను పొడిగించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ డీపీఓ షెహాబాజ్, ఎం పీపీ బొరిగొర్ల ఉషామురళి, స్థానిక సర్పంచ్ కొంగ లేటి గ్రేస్ రత్నకుమారి ,దేవానంద్, తహసీల్దార్ యం. సువర్ణ, ఎంపీడీఓ వసంతరావునాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







