ప్రజల వద్దకే పాలన -ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకవచ్చి ఎంతో మేలు చేసిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. కురిచేడుమండలంలోని పెద్దవరంలో ఆదివారం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరో గ్యకేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ … ప్రతి గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి అందులో ప్రభుత్వ అధికారులుండి ప్రజలకు ఏ అవసరమొచ్చిన తమ గ్రామాల్లోనే పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లక్షల మందికి తమ ఇళ్ల వద్దనే వారికి అవసరమైన సర్టిఫి కెట్లు ఉచితంగా ఇచ్చినట్లు చెప్పారు. గ్రామాలకు ప్రభుత్వ కార్యాలయాలు కిరీటాల్లా ఉన్నాయని, ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రామ సచివాల యం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్యకేంద్రం, పాల కేంద్రం, డిజిటల్ లైబ్రరీ వంటి కార్యాలయాలు అన్ని ఒకే చోట నిర్మించడం శుభపరిణామమన్నారు. రైతు భరోసా కేంద్రాలతో విస్తృత ఉపయోగంఉందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. వైసిపి నాయకులు బెల్లం చంద్రశేఖర్,  పెద్దవ రం, బయ్యవరం, కల్లూరు సర్పంచ్లు మారెళ్ల నరసమ్మ, మాలెపాటి నాగేశ్వరరావు, నక్కా రామకృష్ణ.ల, కురిచేడు ఎంపీటీసీ బుల్లం వెంకటనర్సయ్య, ఏఎం సీ డైరెక్టర్ కాశయ్య, వైఎస్సార్ సీపీ మండల ప్రచార కమిటీ కార్యదర్శి కండె గంగయ్య, నాయకులు వరికూటి వెంకటేశ్వర్లు, మారెళ్ల రామాంజి, చెన్నంశెట్టి గురవయ్య. తెల్లమేకల వెంక టేశ్వర్లు, అడుసుమల్లి పెద్ద సాంబయ్య, పెద్దయ్య, గొట్టిపాటి బొల్లికొండయ్య, సారెడ్డి నాగిరెడ్డి, రోడ్డా వెంకటరెడ్డి, యర్రగుంట్ల రోశయ్య, వేమా శ్రీను, ఈ ఓ ఆర్డీ ఆర్వీఎస్ ప్రసాద్, వ్యవసాయాధికారి పి. మధు, వైద్యాధికారి పి. ప్రవీణ్ పాల్గొన్నారు.
*నూతన వధూవరులకు ఆశీర్వచనం*
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా సోదరుని కుమార్తె వివాహానికి దర్శి శాసన సభ్యుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదివారం హాజరై వధూవ రులను ఆశీర్వదించారు. నూతన జీవితం ఆనందంగా గడవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
సానికొమ్ము తిరుపతి రెడ్డి, మండల జే సి ఎస్ కన్వీనరు మేరువ సుబ్బారెడ్డి, నాయకులు బెల్లం చంద్రశేఖర్, కండె గంగయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, కర్నాటి చిన్న వెంకటరెడ్డి, సాదం నాసరయ్య, ఎంపీటీసీ కానాల శివారెడ్డి, కొత్త వెం కట అయ్యపుశెట్టి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *