తాళ్లూరు మండలం రజానగరం నాగారప్పమ్మ గుడికి నిర్మాణానికి దర్శ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చేయూత అందించారు . గుడి నిర్మాణ విషయమై గ్రామ సర్పంచ్ వలి, బీసీ సంఘ నాయకుడు శ్రీనివాసరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే తనవంతుగా రూ. 50,000 రూపాయల నగదును అందించారు. సహకరించిన ఎమ్మెల్యేకు సర్పంచి వలి ఇతర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
