సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడులు సాధించ వచ్చని మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలం లోని శివరామపురంలో ఆదివారం రైతులకు సేంద్రియ ఎరువు వాడకంపై అవ గాహన కల్పించారు. ఈసందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు మాట్లాడుతూ… రైతులు ఎన్ని రకాల రసాయన ఎరువులు వేసినా సేంద్రియ ఎరువుతో సాటి రావన్నారు. సేంద్రియ ఎరువు అధిక దిగుబడికి కల్పతరువులని తెలిపారు. ఎకరానికి ఐదు ట్రాక్టర్ల సేంద్రియ ఎరువు వాడితే సరి పోతుందన్నారు.
