రిజిస్టర్ భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తగిన చర్య లు తీసుకోవాలి -ముండ్లమూరు డిప్యూటీ తహసీల్దార్ కి వినతి

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బృందావనం రెవిన్యూ విలేజ్ గ్రామ సర్వేనెంబర్ 59/2 లో 18 సెంట్లు సిరిమల కోటమ్మ W/0 వెంకట శేషయ్య రిజిస్ట్రేషన్ భూమి కలదు. ఆ భూమిని ప్రభుత్వ పరిమిషన్ లేకుండా అక్రమంగా వెంచర్లేసి రిజిస్ట్రేషన్ భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని బాధితురాలు సిరిమల కోటమ్మ డిప్యూటీ తహసీల్దార్ పుల్లారెడ్డి ని దళిత, ప్రజా సంఘాల నాయకుల తో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దర్శి పి డి సి సి బ్యాంక్ డైరెక్టర్ అన్నవర వెంకటేశ్వర్లు, గర్నెపూడి ప్రేమకుమార్ లు మాట్లాడుతూ… సిరిమల కోటమ్మ భూమి రిజిస్టర్ 2011లో చేసుకోవడం జరిగిందని, అప్పటినుంచి ఇప్పటివరకు తన ఆధీనంలో ఉండి ప్రభుత్వాలకు కట్టాల్సిన పన్నులు కట్టి ఆన్లైన్లో చేపించుకోవడం జరిగిందని అన్నారు . కానీ ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు బొట్ల కోటేశ్వరరావు, జూపల్లి శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్ భూమి ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారిపై చట్టపరమైన చర్య తీసుకొని బాధితురాలకు న్యాయం చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *