మొక్కలుపర్యావరణానికి దోహదపడతాయి -టిడిపి ప్రకాశం మాజీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటినట్టయితే పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని టిడిపి ప్రకాశం మాజీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో సోమవారం గుద్దేటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో వృక్ష సంపద తగ్గిపోతున్నాయని అందువల్ల వర్షాలు సకాలంలో కురవడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పచ్చదనాన్ని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గోపి ,గురవయ్య, సుబ్బారావు , ఏరేసి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *