తాళ్లూరు మండలంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నకు ఘన నివాళి

తాళ్లూరు అంబేద్కర్ నగర్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్నకు ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. సంతాప సభలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య మాట్లాడుతూ … గద్దర్ గారు కెనరా బ్యాంక్ బ్యాంకు క్లర్క్ గా 1975 ఉద్యోగం చేస్తూ తన అమూల్యమైన జీవితాన్ని కుటుంబాన్ని తెజించి నిరుపేద వర్గాల అభివృద్ధి కోసం పీపుల్స్ వారి పార్టీలో చేరి వ్యవస్థాపక సభ్యులుగా కీలక పాత్ర పోషించి జననాట్యమండలి స్థాపించి తద్వారా భారత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పర్యటించి ఆయా రాష్ట్రాల నిరుపేద వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రజలను చైతన్య పరచారని అన్నారు. 1985లో కారంచేడు మారణ హోమం లో నేనున్నానంటూ …మన దళిత జాతి కి అండగా ఉండి ‘దళిత పులులమ్మ ‘అనే పాట ద్వారా దళిత జాతిని మేల్కొల్పిన మహానీయుడన్నారు .ఆయుధం ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా మాత్రమే నిరుపేద వర్గాలకు న్యాయం చేయగలమని భావించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ తుది శ్వాస విడవటం జరిగిందన్నారు. ఆయన లేని లోటు భారత దేశ నిరుపేద వర్గాలకు తీరని లోటు అని అన్నారు . గద్దర్ అన్నకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలరని వారికి విప్లవాత్మకమైన పేర్లు పెద్దబ్బాయి సూర్యడు, చిన్నబ్బాయి చంద్రుడు కుమార్తెకు వెన్నెల అనే పేర్లు పెట్టి తన ఆటపాటల ద్వారా దేశాన్ని విప్లవాత్మకమైన మాటలతో ఉర్రూతలూగించిన గద్దర్ అన్న మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గద్దర్ అన్నకు ఒంగోలు తో మంచి సంబంధాలు ఉన్నాయని పలు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఎం జగన్ మోహన్ రావు, ఆరిక జైపాల్ రావు బంటుపల్లి ఇస్మాయిల్, తిప్పా బత్తిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *