పేదలకు వరాలు.. నవరత్నాలు-ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఘనత దివంగత సీఎం రాజన్న దే –మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ -దర్శి ముస్లిం బజారులో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహణ

గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న నవరత్నాలు పేదల పాలిట వరాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్ట ణంలోని 17వ వార్డు ముస్లిం బజారులో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను స్థానిక ముస్లింలు దుశ్శాలు వాలు తో , పూలమాలతో సత్కరించారు. మహిళలు హారతులు ఇచ్చారు. వైయస్సార్ సిపి ప్రభుత్వం ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. నాడు తండ్రి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే నేడు ఇమాంమ్లు, మౌళానాలకు గౌరవ వేతనం అందించాడని గుర్తు చేశారు. వారికి వస్తున్న ప్రభుత్వ పథకాల గురించి ఎమ్మెల్యే ఇటింటికీ తిరిగి వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎంపీపీ సుధా అచ్చయ్య , గ్రీనరీ మంచి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరు పతిరెడ్డి, వార్డు ఇన్చార్జ్ పాణెం మజ్ను వలి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, మోహన్ బాబు, తాళ్లూరి బాబూరావు, పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, రెహమాన్, పాణెం హుస్సేన్, పుట్ట రవి, గురవయ్య, హరీష్, అంకబాబు, మిల్లర్ బుజ్జి, ఖాశీం బ్రదర్స్, గుంజి వెంకటేశ్వరరెడ్డి, పాణెం వెంకటేశ్, నబీ, చిమటా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *