క్షేత్ర స్థాయిలో ఫార్మ్ రోబో ట్రాక్టర్ పనితీరు ప్రదర్శన – అడ్వాన్స్ టెక్నాలజీని రైతులకు అందించేందుకే ఫార్మ్ రోబో టెక్నాలజీతో ట్రాక్టర్ తయారీ చేసినట్లు సెల్స్ హెడ్ రాధా క్రిష్ణ వెల్లడి – అసక్తిగా తిలకించిన రైతులు

రైతును రాజును చేయటమే లక్ష్యంగా ఫార్మ్ రోబో కంపెనీ రోబో టెక్నాలజీతో రైతులకు సాగులో చోదోడు వాదోడుగా ఉండేందుకు రోబో ట్రాక్టర్ ను నిష్ణాతులు ఆధ్వర్యంలో తయారు చేసినట్లు రోబో కంపెనీ సెల్స్ హెడ్ రాధా క్రిష్ణ తెలిపారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో మంగళవారం ఫార్మ్ రోబో టెక్నాలజీ ప్రవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారు చేసిన రోబో ట్రాక్టర్ ను క్షేత్ర స్థాయిలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫార్మ రోబో సెల్స్ హెడ్ రాధా క్రిష్ణ మాట్లాడుతూ…. 70శాతం వ్యవసాయ ఆధారితమైన భారత దేశంలో చిన్న చిన్న సూక్ష్మ పనులకు మెన్ పవర్ తక్కువ కావటంతో వ్యవసాయ రంగంపై రైతులతో పాటు నేటి యువతలో ఆసక్తి తక్కుతున్న విషయాన్ని గమనించని ఫార్మ్ రోబో కంపెనీ, ప్రత్యామ్నాయ పద్ధతులకు అన్వేషించి రోబో ట్రాక్టర్ ను తయారు చేసినట్లు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సమకూర్చటంతో ఫార్మ్ రోబోకి తిరుగులేదని చెప్పారు. ఫార్మ్ రోబోలో 7 హార్పవర్ కలిగి ఉంటుందని, బ్యాటరీ సామర్థ్యం ఏడు నుండి పది సంవత్సరాలు పనిచేస్తుందని చెప్పారు. ఒక్క ఎకరానికి కేవలం రెండు రూపాయలతో వ్వవసాయ పనిచేస్తుందని అన్నారు. గొర్రు, గుంటుక, టైలర్, పిచికారి వంటి అనేక పనులను చేస్తుందని వివరించారు. సులువుగా దీనిని వాడుకోవచ్చని చెప్పారు. రుణ సదుపాయం కలదని వివరించారు. రైతులు శ్రీనివాస్ రెడ్డి, బిజ్జం కృష్ణారెడ్డి, కైపు వెంకటేశ్వర రెడ్డి, చేరెడ్డి రామ మునిరెడ్డి, మేడగం తిరుపతిరెడ్డి, వడ్డే సీతారామి రెడ్డి, కోట బ్రహ్మారెడ్డి, అవిసన వీరారెడ్డి, చింతల కోటిలింగారెడ్డి, ఉల్లి హనుమంతరావు, మేడగం వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఆసక్తిగా తిలకించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *