దర్శి ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలం దించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసు పత్రిలో సౌకర్యాలు, మార్చురీ గది ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆసుపత్రి బయట దాతల సహకారంతో బోర్డు వేయించాలని ఆసుపత్రి వారు కోరగా వైఎస్సార్ సీపీ నాయకులు తాము పనులు చేపిస్తామని హామీ ఇచ్చారు. మొక్కలు నాటాలని సూచించారు. గ్రీనరీ అండ్ బ్యూటి ఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైద్యులు సుమన్, కౌన్సిలర్ వీసీరెడ్డి
పాల్గొన్నారు.
*నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి*
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివాసాలు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సూచించారు. దర్శి నగర పం చాయతీ పరిధిలోని జగనన్న కాలనీలను ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి వసతి, విద్యుత్ వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నివాసాలు పూర్తి చేసుకున్నవారు త్వరిత గతిన గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఈ నిరీక్షణ రావు మాట్లాడుతూ సిమెంట్, స్టీల్, ఉచిత ఇసుక రూ. 20 వేలు అడ్వాన్స్ పేమెంట్ల వంటివి ముందుస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నగర పంచాయతీ కమిషనర్ మహేష్, ఏఈ షేక్ షాకీర్ బాషా వైఎస్సార్ సీపీ నాయ కులు మదిశెట్టి రవీంద్ర, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, మిల్లర్ బుజ్జి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



