అటవీ భూములు ఉన్న వారికి ప్రభుత్వం ద్వారా అన్ని వ్యవసాయ పథకాలు వర్తింపు – ఆది వాసీలు అభివృద్ధిలో బాగం కావాలి – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

అటవీ భూములు కలిగిన ఏకలవ్యనగర్ రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని వ్యవసాయ పథకాలు వర్తింప చేసేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖాధికారి బి. ప్రసాదరావు అన్నారు. ఏకలవ్యనగర్ అటవీ భూములనువ్యవసాయాధికారి బుధవారం పరిశీలించారు. 73 మంది రైతులు 254.26 ఎకరాలు కలిగి ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. సంబంధిత రైతులు పంటలు సాగు చేసి ఈ- క్రాప్ నమోదు చేసుకుంటే అన్ని పథకాలు వర్తిస్తాయని అన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న బత్తాయి తోటలను నమోదు చేసారు. మిగిలిన రైతులు త్వరలో ఈ – కెవైసీ చేయించుకోవాలని కోరారు. విఏఏ సుమ, ప్రకృతి ఇన్చార్జి నరసింహులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *