ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయం – వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

ఆగస్టు 19 తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కళానిలయం వారి ఆధ్వర్యంలో క్వీ స్ ఇంజనీరింగ్ కళాశాల మరియు బి ఎం ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం వారి సహకారంతో ఒంగోలు లో రాష్ట్రస్థాయి ఫోటో కాంటెస్ట్ నిర్వహించటం జరుగుతుందని , అలాగే అంబేద్కర్ భవనంలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు జరుగునని ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమైనదని నిర్వాహకులు గీరా అజయ్ బాబు, అంగలకుర్తి ప్రసాద్, వేలూరు శ్రీనివాసరావు తెలియజేశారు . ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు పోస్టర్లు కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… ఫోటోగ్రఫీ దినోత్సవం మంచి కార్యక్రమం అని ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఒంగోలులో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం మంచి పరిణామం అని ఇటువంటి పోటీలు పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంటాయని ఒంగోలులో నిర్వహించటం వలన జిల్లా ఫొటోగ్రాఫర్లు అందరికీ మంచి వేదిక కల్పించి ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించడం వలన రాష్ట్రవ్యాప్తంగా మంచి మంచి చిత్రాలను ఒంగోలు నగర మరియు జిల్లా వాసులు కనిపించే అవకాశం ఉంటుందని తెలుపుతూ నిర్వాహకల్ని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఫోటో కాంటెస్ట్లో ఫోటోగ్రాఫర్లు ప్రెస్ ఫోటోగ్రాఫర్లు, ఫోటోగ్రఫీ పై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొనవలసిందిగా కోరారు. మొదట బహుమతి రూ. 20 వేల రూపాయలు రెండవ బహుమతి రూ.పదివేల రూపాయలు మూడవ బహుమతి రూ.5000 వేల రూపాయలు ఐదు కన్సోలేషన్ బహుమతులు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సత్కారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి డి రవికుమార్. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మణ్ నాయక్, వికలాంగుల శాఖ ఏడీ అర్చన తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *