ఓట్ల తొలగింపులో నిబంధనలు పాటించాలి -కలెక్టర్ దినేష్ కుమార్

ఓటర్ల జాబితాలో తొలగింపుల ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో బుధవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సంబంధిత అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటప్పుడు ఫారం-7, సంబంధిత కుటుంబానికి నోటీసు జారీ చేసే విషయాలనుపాటించాలన్నారు. బీఎల్ఎల పనితీరును నిరం తరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తు ఓటర్లను గుర్తించడం లో నిబంధనల ఉల్లంఘన జరగకూడదన్నారు. ఓటర్ల జాబితా తయారీలో స్పష్టత ముఖ్యమన్నారు. చిరునామా విషయంలో జంక్ క్యారెక్ట ర్లు ఉన్న కేసులపై బీఎల్ఎలు ప్రత్యేక దృష్టి
సారించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ …బీఎల్డీ యాప్ స్లోగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అయితే ఈ విష యాన్ని గత వారం విశాఖలో జరిగిన సదస్సులో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలో ఈ సమస్య పరి ష్కారం అవుతుందని ఈసీ అధికారులు తెలిపారన్నారు. జిల్లాలో అన్నీ నియోజకవర్గాల్లో డోర్ నంబర్ల వారీగా ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని ఓటర్ల జాబితలో లోపరహితంగా రూపొందించడంలో సహకరించాలని సూచించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ ఓ శ్రీలత, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, ఈఆర్డు, ఏఆర్డీలు, వైఎస్సార్ సీపీ నుంచి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల నుంచి కాలేషబేగ్, రాజశేఖర్, సత్యం, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *