బిజెపి మతోన్మాదానికి వచ్చే ఎన్నికలలో ప్రజలు చరమగీతం పాడాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం దరిశి మండలంలో క్విట్ ఇండియా రోజున నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బిజెపి పాలన కుల వివక్షతతో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు సందు వెంకటేశ్వరరావు, ఏడుకొండలు, పుల్లయ్య, రామాంజనేయులు, మోహన్ రావు, నరసింహ, రవి పాల్గొన్నారు.
