గ్రామాల పరిశుభ్రత అందరిభాద్యతని ఐపిఎస్ ఓఎస్ పీవో ఏ. మోహన్ రావు తెలిపారు. తాళ్లూరులోని పారిశుద్య పరిస్థితిని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వాడాలని, బహిర్భూమికి వెళ్లి వచ్చిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మురుగు నీరు నిల్వ వుండకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మా ణాలు చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని తెలిపారు. ఎస్ డబ్ల్యు పిసీ రికార్డులను, వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకంను, వ్యక్తిగత పరిశుభ్రత, ఇన్స్టిట్యూ షనల్ బిల్డింగ్ నందు పారిశుద్యనిర్వహణ, సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పరిశీలిం చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వర రెడ్డి , సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్,
ఈఓఆర్డి కెజిఎస్ రాజు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్లాక్ మిత్రలు తదితరులు పాల్గొన్నారు.


