ఎయిమ్స్ నిర్వహించిన పీజీ మెడి కల్ పరీక్షలో ఒంగోలు విద్యార్థి 20వ ర్యాంకు సాధించాడు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల య్యాయి. స్థానిక వైద్యుడు మధు కిరణ్ రెడ్డి కుమారుడు జి. ప్రదీప్ సుందర్ రెడ్డి ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. పుదుచ్చేరి జిప్ మర్ లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తండ్రి నగరంలో కిరణ్ న్యూరో ఆసుపత్రి నిర్వహిస్తుండగా, తల్లి భగీరథీదేవి జిల్లా వైద్యఆరోగ్యశాఖలో మెడికల్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్నారు. చండీఘర్లో పీజీ జనరల్ మెడిసిన్ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు విద్యార్థి తెలిపారు.
