విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ -14లో హ్యాండ్ బాల్ పోటీలలో తూర్పు గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండవ స్థానం సాధించి సత్తా చాటారు. ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనపరచిన చందు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై త్వరలో డిల్లీలో జరగబోవు పోటీలలో పాల్గొంటుందని పీడీ విజయకుమార్ తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థుల బృందం జి చందు, షేక్ షబాన, షేక్ రషీదాలను పాఠశాల ఆవరణలో మంగళవారం
ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ అరుణకుమారి, పీఎంసీ చైర్మన టి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఏ
నాగి రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు షేక్ ఆదాం షరీఫ్, ఉపాధ్యాయులు అభినందించారు..
