రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించిన అండర్ -17 పోటీలలో సరస్వతి విద్యార్థులు మూడవ స్థానం సాధించినట్లు హెచ్ఎం శ్రీరామమూర్తి తెలిపారు. తిరుపతి జిల్లా నేరబైలులో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో 3వ స్థానం సాధించటం పట్ల విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, పీఈటీలు విద్యార్థులను అభినందించారు.
