రహదారి భద్రతా నియమాలు పాటించాలి – ఉప రవాణా కమిషనర్ సుశీల

విద్యార్థులు, వాహనదారులు రహదారి భద్రతా సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఉప రవాణా కమిషనర్ సుశీల సూచించారు. బుధవారం ఒంగోలులోని హర్షిణి కళాశాలలో విద్యార్థు లకు సంస్థ చైర్మన్ రవికుమార్ అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడ పాలని సూచించారు. జీవితం చాలా విలువైనదని, తాత్కాలిక ఆనందం కోసం భద్రతను పాటించకుండా ముప్పు తెచ్చుకోవద్దని చెప్పారు. ఎం వీఐలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, ఎల్. సురేంద్ర ప్రసాద్, ఎన్.జ గదీష్, కె.జయప్రకాశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఓవర్ స్పీడ్ వెళ్లడం ట్రిపుల్ రైడింగ్, ఛేజింగ్లు మానుకోవాలని హితవు పలికారు. డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని చెప్పారు. ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *