ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఎం.వి.ఐ) పి.రవికుమార్ అవగాహన కల్గిం చారు. ఆటో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు పడపరాదని, అలా చేసిన వారికి జైలుశిక్ష, జరి మానా విధిస్తామని హెచ్చరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, బస్సు పాయింట్ల వద్ద ఆటోలు నిలపరాదని, వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ పత్రాలను తప్పనిసరిగా బండిలో ఉంచుకోవాలన్నారు. పరిమితికి మించి వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించు కోరాదని సూచించారు.

