చిరుధాన్యాల సాగు రైతుకు లాభసాటి – తాళ్లూరు వ్యవసాయ అధికారి ప్రసాదరావు

రైతులు చిరుధాన్యాల సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని మాధవరంలో శనివారం చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన రైతులతో మాట్లాడుతూ.. ఎకరా వరి సాగుకు ఖర్చు చేసే నీటితో పది ఎకరాల చిరుధాన్యాల సాగు చేయవచ్చన్నారు. చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిం చిందన్నారు. ఖాళీగా ఉన్న భూముల్లో మైనర్ మిల్లెట్స్ సాగు చేసుకుంటే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. బోర్ల ద్వారా వచ్చే నీటితో ఆరు తడులకు నీరు ఉప యోగించుకోవచ్చన్నారు. సాగర్ జలాల నీటి లభ్యత లేనందున చిరుధాన్యాల సాగుపై ఆశక్తి పెంచుకోవాలన్నారు. వీఏఏ సుధీర్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *