దర్శి నగర పంచాయతీ పరిధి ఆటోనగర్ సమీపంలోని ఎస్టీ కాలనీలో శనివారం ఉదయం సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు (కార్డన్ సెర్చ్) చేపట్టారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో డీఎస్పీ అశోకవర్థన్ రెడ్డి పర్యవేక్షణలో దర్శి సీఐ రామకో టయ్య, సెబీ సీఐ సుందరరామయ్యల ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని 60 మంది పోలీసు సిబ్బంది, పొదలి సెబ్ సిబ్బందితో ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇటీవల పట్టణ పరిధిలోని శివరాజ్ నగర్ నువ్ చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కాకినాడ వద్ద గంజాయి తరలిస్తూ దొరికిపోవడంతో ఈ తని ఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిల్వలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిగాయి. సరైన ధ్రువపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఐలు మాట్లాడుతూ …గంజాయి దాచినా, విక్రయించినా చట్ట ప్రకారం జైలుకు పంపనున్నట్లు హెచ్చరించారు. దొంగ వాహనాలను కొనుగోలు చేయడం, సరైన ధ్రువప త్రాలు లేని వాహనాలను కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని వివరిం చారు. ఎస్సై రామకృష్ణ, ఇతర సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.




