తాళ్లూరు మండలంలోని గుంటి గంగ సన్నిధిలోని గుంటిగంగ బ్రాహ్మణ సత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను ఘనంగా నిర్వహిం చా రు. బ్రాహ్మణ సత్రం అధ్యక్షులు యల్లాప్రగడ త్రిపు రసుందరీ లక్ష్మి, మండల బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ దంపతులు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని చేశారు. మూడేళ్లుగా వేదపండితుల సారథ్యంలో సత్య దేవుని వ్రతాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని తిలకించి స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సత్రం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో వున్నదని, అన్ని వసతులు కల్పిస్తున్నామని త్రిపురసుందరీ లక్ష్మి తెలిపారు. అనంతరం బ్రాహ్మణులు వనభోజన కార్య క్రమం చేపట్టారు. సత్రంలో సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, గోమాతపూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్రం కమిటీ ఆధ్వర్యంలో సత్రం అభివృద్ధికి కృషి చేసిన పెద్దలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సత్రం కమిటీ బాధ్యులు వై.కన్నయ్య, ఆర్వై కోటేశ్వరరావు, నరసింహారావు, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, నాగరాజు, ఫణి, వెంకటేశ్వరి పాల్గొన్నారు.

