ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలకు భారీ ఊరట కల్పించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఘన సన్మానం – సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల గుర్తింపును మూడు సంవత్సరాల నుండి 8సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటంలో, జీఓ నంబర్ 30 విడుదలలో ఎమ్మెల్సీల కృషి మరువలేనది. అందులో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కృషిని కొనియాడుతూ ఆదివారం మాగుంట లే అవుట్లో ని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని అపుస్మా సంఘం బాధ్యుడు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సంద్భర్బంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… గత ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, విద్యాశాఖా మంత్రి బొజ్జ సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కాంట్రాక్ట్ లేక్చరర్ల సమస్యతో పాటు ప్రభత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యతో పాటు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సందర్భంగా ప్రవేట్ పాఠశాల సమస్యపై చర్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి ఆనాడే హామీ ఇచ్చినట్లు చెప్పారు. మూడు సంవత్సరాల పెంపుతో పాటు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం కూడ వెసులు బాటు కల్పింనందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. గతంలో మూడు సంవత్సరాల గుర్తింపు పొందిన పాఠశాలలు కూడ ఆటోమెటిక్గా 8సంవత్సరాల గుర్తింపు పొడగింపు చాలా మంచి విషయమని అన్నారు. అపుస్మా నాయకులు సుబ్బా రెడ్డితో పాటు పలు జిల్లాల నాయకులు, స్థానిక బాధ్యులు పాల్గొని జీవో విడుదలపై సంతోషం వ్యక్తం చేసారు. ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *