రైతు అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి -ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

రైతుల అభ్యున్నతే రాష్ట్ర అభివృ ద్ధి.. అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. పోలేపల్లిలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఆ పార్టీ కన్వీనర్ కందుల నారపురెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వ హించారు. ఎమ్మెల్యే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ టీసీ యద్దనపూడి జాన్మార్క్ ఎస్సీ లో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును, రూ.40 లక్షలతో నిర్మించిన సచి వాలయం, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ మన వ్యవస్థలో ఇం కా మార్పు రావాలంటే మన జీవితాలు మారాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని గుర్తు చేశారు. అనంతరం మా నమ్మకం నువ్వే
జగనన్న బోర్డును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల కన్వీనర్ కందుల నారపురెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీలు వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిట్టా కోటిరెడ్డి, సర్పంచ్లు యద్దనపూడి జాన్ ప్రకాష్, వజ్రగిరి రాణి సొలోమన్, బాపన పల్లి మంగమ్మ శ్రీను, దర్శి ఏఎంసీ చైర్మన్ మిల్లర్ బుజ్జీ, కన్వీనర్ పోలయ్య, ఎంపీటీసీ జాన్ మార్క్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *