తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ పరిధి లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగ సన్మిధిలోని శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయపునఃప్రతిష్ఠ, ఆలయ శిఖర జీవ ధ్వజ స్తంభ ప్ర తిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ప్రతిష్ఠాపనా చార్యులు కౌశిక వేంకటరమణశాస్త్రి ఆధ్వర్యంలో వే దపండితులు విఘ్నేశ్వర, నాగ దేవత, జంటనాగులు, నందీశ్వర ఆలయ జీవధ్వజం, నవగ్రహవిగ్రహాల ప్రతిష్ఠ, ఆల యాల శిఖరాలు, జీవధ్వజ స్థంబాలను ప్రతిష్ఠించారు. గర్తపూజ, విగ్రహ ప్రతిష్ఠ, గోపుర శిఖర కలశప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మహాకుంబాభిషేకం, జ్వాలా దర్శనం, మహా మంగళ హారతి, శాంతి కల్యాణం, మహాదారాశీర్వచనం వంటి కార్యక్రమాలు నిర్వ హించారు. ఆలయం ముందు భాగంలో రాతిజీవధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈనెల 18 నుంచి 20వరకు వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు నిర్వ హించారు. తాళ్లూరు మండల వైసీపీ అధ్యక్షుడు మద్దిశెట్టి రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుంటి గంగా భవాని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసారు. ఆయన వెంట తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం ఎన్పి నాగార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సొసైటీ చైర్మన్లు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, సర్పంచిలు వలి, పీ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచి కాశి రెడ్డి, నాయకులు హనుమంతరావు, నాగి రెడ్డి, దర్శి మండల నాయకుడు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి, దర్శి కౌల్సిలర్ వీసీ రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవదానం, సయ్యద్ లతీఫ్, జెసీఎస్ కెవీ పాలెం కన్వినర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

