అర్హులందరికీసంక్షేమ పథకాలు అందాలంటే జగనన్ననుమళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన
బాధ్యత మనందరిపై ఉందని వైసిపి తాళ్లూరు మండలం ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. తాళ్లూరు మం
డలంలోనివెలుగువారిపాలెంలోసోమవారం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు. మా నమ్మకం నువ్వే జగన్ బుక్ లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నగ్రామ మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి కుమారుడిని పరామర్శించారు. జెడ్పీటీసీ మారంవెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఎడమకంటివెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకానాగార్జునరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూమువెంకట సుబ్బారెడ్డి, కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, సొసైటీ అధ్యక్షులు యలమందారెడ్డి, జయరామిరెడ్డి, సర్పంచ్లు సుమలత శ్రీకాంత్ రెడ్డి, వలి, సుబ్బారావు, మాజీసొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి, మాజీసర్పంచ్ ఓబులరెడ్డి, ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు బ్రహ్మారెడ్డి, ఎర్రగంగిరెడ్డి,విష్ణు, ఎంపీడీఓ కేవైకీర్తి, ఈఓఆర్డీ రాజు,ఏపీఎం దేవరాజ్ పాల్గొన్నారు.




