వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ పరిధి లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగ సన్మిధిలోని శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయపునఃప్రతిష్ఠ, ఆలయ శిఖర జీవ ధ్వజ స్తంభ ప్ర తిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ప్రతిష్ఠాపనా చార్యులు కౌశిక వేంకటరమణశాస్త్రి ఆధ్వర్యంలో వే దపండితులు విఘ్నేశ్వర, నాగ దేవత, జంటనాగులు, నందీశ్వర ఆలయ జీవధ్వజం, నవగ్రహవిగ్రహాల ప్రతిష్ఠ, ఆల యాల శిఖరాలు, జీవధ్వజ స్థంబాలను ప్రతిష్ఠించారు. గర్తపూజ, విగ్రహ ప్రతిష్ఠ, గోపుర శిఖర కలశప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మహాకుంబాభిషేకం, జ్వాలా దర్శనం, మహా మంగళ హారతి, శాంతి కల్యాణం, మహాదారాశీర్వచనం వంటి కార్యక్రమాలు నిర్వ హించారు. ఆలయం ముందు భాగంలో రాతిజీవధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈనెల 18 నుంచి 20వరకు వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు నిర్వ హించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుంటి గంగా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .మాజీ ఎంపీపీ పో శం మధు సూదన రెడ్డి, సర్పంచ్ చిమట సుబ్బారావు, గుజ్జుల యోగిరెడ్డి, పె ద్దిరెడ్డి, రామకృష్ణ తదితరులు ఆమె వెంట పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *