తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ అమరావతి కాలనీలో మంగళ వారం.స్థానికులతో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాట్లాడారు.
బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు అధి కారం లో వున్నప్పటికీ కంటోన్మెంట్ అభివృద్ధి కి ఏ మాత్రం సహాయ సహా కారాలు అందించలేదన్నరు.రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
కంటోన్మెంట్ అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా జరిగిందని కాలనీవాసులకు రామకృష్ణ తెలియజేశారు.కంటోన్మెంట్ అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి, అసెంబ్లీలో మన సమస్యలను ప్రస్తావించి నిధులు తీసుకువచ్చే ఎమ్మెల్యే కావాలన్నారు.ప్రజా సమస్యల కోసం పోరాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండే శ్రీ గణేష్ కి మద్దతు ఇవ్వాలనీ అభ్యర్థించారు.కొందరు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని క్రైస్తవులు ముస్లిం ప్రజలు మోడీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నారని రామకృష్ణ గుర్తు చేశారు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి సంక్షేమ, పథకాలు ప్రజలందరికీ అందుతాయని రామకృష్ణ తెలియ జేశారు.

