కంటోన్మెంట్ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలను ఓటు అడిగే హక్కు బీ ఆర్ ఎస్ నాయకులకు లేదని.తమిళ నాడు రాష్ట్ర బీ జే పి అధ్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు.ఎన్నికల ప్రచారం లో భాగంగా ఖార్ఖానా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నమలై తో కలిసి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలకు మరోసారి ప్రజలు మోసపోవద్దని సూచించారు. సమర్థత గల నాయకుడు ఉంటేనే కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ అభివృద్ధి కి నోచుకోలేదన్నారు. కంటోన్మెంట్ కు నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు కావాలో… సొంత ప్రయోజనాల కోసం పాకులాడే నాయకులు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల లాగా మన కంటోన్మెంట్ కూడా అభివృద్ధి జరగాలంటే…. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే నాయకుడు కావాలన్నారు. ప్రజలు తనకు ఒక అవకాశం కల్పిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *