సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్.కోట నీలిమ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.ప్రచారంలో భాగంగా బేగంపేట డివిజన్ లలోనీ వికార్ నగర్ జరిగిన సభలో పాల్గొన్నారు.ప్రతి బి ఆర్ఎస్ కు ఓటు వేయవద్దు స్థానిక ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని, తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ….. కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకాన్ని ఉంచి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిందని ,5 సంవత్సరాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటూ , కష్ట సుకాల్లో పాల్పంచుకుంటానని,నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని మీరంతా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ ఫిoచన్, ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్ట్ లు సంక్షేమ పథకాలు ఉండేవని, రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ పార్టీలు పదేళ్ళ పాలనలో చేసిందేమి లేదని విమర్శించారు.ఈ ప్రచారంలో జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నేట డిసౌజ మాట్లాడుతూ ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ మైనార్టీ మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ మైనార్టీ నాయకులు సలీం ఖాన్, అనీఫ్, డివిజన్ చెందిన మైనార్టీ నాయకులు స్థానిక మహిళ నాయకురాలు పాల్గొన్నారు.
