సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్ చౌరస్తా గులాబీజెండాలతో రెపరెపలాడింది. మంత్రి కేటీఆర్ రోడ్ షోకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. సంక్షేమ పథకాల గులాబీజెండాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి గులాబీ పార్టీకి జై కొట్టారు. ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. ఓవైపు వేలాదిమంది గులాబీ సైనికులు మరోవైపు జన ప్రభంజనం పోటెత్తడంతో… జై కేసీఆర్ జై బిఆర్ఎస్ నినాదాలతో అన్నానగర్ చౌరస్తా హోరెత్తింది. కంటోన్మెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు అశేషంగా తరలివచ్చిన జనం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సాయన్న బిడ్డకు అండగా ఉంటామని… ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కంటోన్మెంట్ గడ్డపై ఇతర పార్టీలకు స్థానం లేదని…. వన్ అండ్ ఓన్లీ బిఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.



