బీసీల భవిష్యత్తు బాగుండాలంటే జగన్ రెడ్డిని గద్దె దించాల్సిందే -నాలుగున్నరేళ్ల నరకానికి స్వస్తి పలికి ప్రజాపాలనను ఏర్పాటు చేసుకుందాం – జగన్ రెడ్డి పాలనలో బీసీలపై జరిగినన్ని అకృత్యాలు బ్రిటీష్ పాలనలో కూడా జరగలేదు – ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ

స్వతంత్ర భారత దేశ చరిత్రలో జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో జరిగినంత ద్రోహం, దగా, దాడులు, అరాచకాలు, హత్యలు బ్రిటీష్ పాలనలో కూడా చోటు చేసుకోలేదని బీసీ నేతలు ద్వజమెత్తారు. నరసరావుపేట పట్టణంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ‘బీసీలకు ప్రభుత్వ అన్యాయం పై ఐక్యపోరాటం’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ గౌరవాధ్యక్షులుగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పర్యవేక్షణలో, పల్నాడు బీసీ సెల్ అధ్యక్షులు మున్నా రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వచ్చిన నేతలను ఆకర్షించింది. నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలకు జరిగిన అన్యాయం వివరిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. రద్దు చేసిన పథకాలు, దారి మళ్లించిన నిధులు, హత్యలు గురించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నరసరావుపేట నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు తీవ్రమయ్యాయని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో బీసీలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి కల్పించారన్నారు. వాలంటీర్లతో వేధింపులకు దిగే జగన్ రెడ్డి, బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చిసినా, రూపాయ నిధులివ్వలేదు. మరి 56 కార్పొరేషన్లు ఎవరి కోసం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి బీసీలను దగా చేసే జగన్ రెడ్డిని ఓడించేందుకు బీసీలంతా ఏకమై ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు
డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందని డాక్టర్ నూకసాని బాలజీ ఎద్దేవా చేశారు. నేతి బీరలో నెయ్యి లేనట్లే.. జగన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం కరువైందన్నారు. సామాజిక యాత్ర పేరుతో రోడ్డెక్కిన వైసీపీ నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు చీకొట్టారన్నారు.అసలు వారికి యాత్రలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పూలే, అంబేద్కర్ ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు.బీసీల సాధికారత తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం అన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో, నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం బీసీలకు అగ్రతాంబూలం ఇస్తే, జగన్ రెడ్డి మొత్తాన్ని రెడ్ల చేతుల్లో పెట్టడం బీసీలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.సలహాదారులు, యూనివర్శిటీ వీసీలు,రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో బీసీలకు ఎందుకు అవకాశాలు తగ్గించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీలకు చెందిన దాదాపు 30 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేసి చదువులు దూరం చేశారు. కార్పొరేషన్లకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు.రిజర్వేషన్లు కుదించి రాజకీయంగా అణగదొక్కారు. నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వకుండా మోసం చేశారు.ఇలాంటి జగన్ రెడ్డి ఇప్పుడు బీసీలను మరసారి మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నాడని మండిపడ్డారు._

జగన్ రెడ్డి హయాంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలు మాత్రమే. నాలుగున్నర సంవత్సరాలుగా 74 మందిని హత్య చేశారు. వేలాది మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నిదులు మళ్లించి, రిజర్వేషన్లు కుదించి ఏం ఉద్దరించారని సభలు పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు ఆక్రందనలు పెడుతుంటే.. జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడే జగన్ రెడ్డిని గద్దె దించినపుడే బీసీలు అభివృద్ధి చెందుతారని తెలిపారు.

నాలుగున్నరేళ్ల నరకానికి స్వస్తి పలికేందుకు రాష్ట్రంలోని బీసీలంతా ఉమ్మడిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా జగన్ రెడ్డి నెరవేర్చలేదు. నిధులు లాక్కున్నారు. విధులు లాక్కున్నారు. అధికారాలు దూరం చేసి బస్సు యాత్రలు చేసేందుకు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.

బీసీల ఆక్రందనలు విని పరవశించే జగన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య లాంటి బీసీ బిడ్డల గొంతు కోసి చంపిన జగన్ రెడ్డికి బీసీ అనే పదం పలికే అర్హత కూడా లేదని మండిపడ్డారు. గతంలో అమలు చేసిన పథకాలన్నీ అమలు చేయాల్సిందే. కార్పొరేషన్లకు నిధులివ్వాలి. ఆదరణతో చేతివృత్తుల్ని ఆదరించాలి, చంద్రబాబు బీసీలకు అండగా నిలిస్తే.. జగన్ రెడ్డి బీసీల గొంతులు కోస్తున్నాడన్నారు.

కుల వృత్తుల్ని జగన్ రెడ్డి అణచివేస్తున్నారు. గతంలో కుల వృత్తుల్ని ప్రోత్సహించేలా ఆదరణ పథకం తెచ్చారు. కార్పొరేషన్లకు నిధులిచ్చి స్వయం ఉపాధఇ కల్పించారు. కానీ జగన్ రెడ్డి పథకాలు రద్దు చేసి, నిదులు లాక్కుని బీసీ వర్గాల వెన్ను విరుస్తున్నారన్నారు.

బీసీ కులాలను జగన్ రెడ్డి తీవ్రమైన ద్రోహం చేశారు. హామీలిచ్చి అమలు చేయకుండా వాడుకుని వదిలేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులివ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్లకు నిధులివ్వాలి, కులవృత్తుల్ని ప్రోత్సహించాలి. ఈ ప్రభుత్వం బీసీలపై దాడులు చేస్తూ జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ సమస్యలను తెలుసుకోవాలనే ప్రయత్నం అభినందనీయం. బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు టీడీపీ ప్రోత్సహించింది. జగన్ రెడ్డి అణగదొక్కారు. బీసీలకు తెస్తామన్న రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. విదేశీ విద్య, పెళ్లి కానుకల వంటి పథకాలను పునరుద్దరించాలి. రాజధానిలో ప్రతి కులానికీ ఎకరం స్థలం కేటాయించి హాస్టల్, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి. ఉచిత వైద్యానికీ తోడ్పాటు అందించాలన్నారు.

కార్యక్రమానికి యాదవ సంఘం నాయకులు కడియకోటి సుబ్బారావు, నూర్ బాషా నాయకులు ఖాసిం సైదా,రజక సంఘం నాయకులు ఉదయగిరి వెంకట స్వామి,నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కొర్నెపాటి సంజీవరావు,గౌడ సంఘం నాయకులు యడ్లపల్లి ఏడుకొండలు, ఎంబీసీ నాయకులు బిజిలి వెంకట్రావు, వడ్డెర నాయకులు తన్నీరు ఆంజనేయులు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కొలగాని నంద వీరప్రసాద్, భట్రాజ సంఘం నాయకులు బొగ్గరం ఆంజనేయరాజు, పెరిక సంఘం నాయకులు తోట వీరాంజనేయులు, వాల్మీకి సంఘం నాయకులు రామినేని సాయిబాబు, మేదర సంఘం నాయకులు జరిగే తిరుమల శ్రీనివాస్, తొగట సంఘం నాయకులు సూపోరి బాలయ్య, కృష్ణ బలిజ నాయకులు బత్తుల వెంకటేశ్వరులు, శాలివాహన సంఘం నాయకులు దుర్గా గణేష్, రజక సాధికార సమితి కన్వీనర్ రామకృష్ణ, మేదర సాధికార సమితి కన్వీనర్ ఏసుబాబు, దాసరి సాధికార సమితి కన్వీనర్ తుపాకుల అప్పారావు, భట్రాజ సాధికార సమితి కన్వీనర్ ఆంజనేయరాజు, నగరాల సాధికార సమితి కన్వీనర్ తిరుమలేసు, హెచ్.ఆర్.డి సభ్యులు వల్లెపు నాగేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరేపి ఈశ్వర్, నల్లమేక వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్, జనసేన నాయకులు షేక్ అద్రుఫ్, మిరియం వెంకట సుబ్బమ్మ, బార్ అసోసియేషన్ సభ్యులు పూజ్యుల వెంకట కోటయ్య, ఎంఐఎం నాయకులు కరీముల్లా సహా పలువురు నాయకులు, సంఘం నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *