పొదుపు సంఘ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలో రామాలయం వద్ద మోప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఉత్పత్తుల స్టాల్స్ను ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఉత్పత్తులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాలకు ఇస్తున్న ప్రాధాన్యతను, సహకారాన్ని వివరించారు. ఎమ్మెల్యేకు మెప్మా సంఘ సభ్యులు సన్మానించారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మండల కన్వీనర్ వెన్న పూస వెంకటరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నా రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, సీఎంఎం కల్పన, మొప్మా బాధ్యులు పాల్గొన్నారు.




