పుంసా హైడ్రోజల్ వినియోగంపై బెట్టను సైతం తట్టుకోవగలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ అన్నారు. పి గుడిపాడులో మంగళవారం మినుము, కంది, పొగాకు,వ రి పొలాలను పరిశీలించారు. పుంసా హైడ్రోజల్ వేసిన మినుము పంటకు వేయని మినుము పంటకు ఉన్న తేడాను రైతులకు వివరించారు. ఈ జల్ వాడకం వలన పంట బెట్టకు రాకుండా తేమను పోషకాలను అవసరాన్ని బట్టి నిదానంగా ఉపయోగించుకోవటం వలన పంట పెరుగుదలతో మార్పును వివరించారు. వరి పంటలో జీవన ఎరువులు వేసిన రైతుల పొలంను పరిశీలించి నత్రజని, భాస్వరం ఎరువులను తగ్గించి వేసుకోవాలని చెప్పారు. పొటాష్ ఎరువులు వేయటం వలన పురుగులు, తెగుళ్లు తట్టుకునే శక్తి పెరుగుతుందని తెలిపారు. మినుము, పొగాకు పంటలో లద్దె పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చడం, విషపు ఎరను వాడటం వలన పురుగును అరికట్టవచ్చని చెప్పారు. కందిలో గూడు పురుగు రాకుండా నివారణ చర్యలు తెలిపారు. కార్యక్రంలో డిఆర్సీ వివి శేషమ్మ, విఏఏ సీహెచ్ వెంకటేష్ రైతులు పాల్గొన్నారు


