ట్రాక్టర్ తో పొలానికి వెళ్లి పనులు చూసుకుని సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా ఎన్ఎస్పీ కాలువ గట్టుపై
నుంచి ట్రాక్టర్ కాలువలోకి తిరగబడి వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై
తాళ్లూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదయింది. తూర్పుగంగ
వరం గ్రామానికి చెందిన యాడిక చినసుబ్బారెడ్డి సోమవారం ట్రాక్టర్ పై
పొలంకు వెళ్లాడు. సాయంత్రం కాలువ గట్టు మీదుగా ఇంటికి వస్తుండగాతాచుపాము కాలువ గట్టు మీదకు వచ్చింది. దానిని తప్పించే క్రమంలోముందు టైర్లు కాలువలోకి వెళ్లిపోయాయి. ఏటవాలుగా ట్రాక్టర్ కాలువలోకి వెళ్లడంలో అదుపు తప్పి తిరగబడింది. చినసుబ్బారెడ్డి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. భార్య వెంకటలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ జి.మోహన్ రావు కేసు నమోదు చేశారు.
వీరికి కుమారుడు ఉన్నాడు.
